మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శనివారం ప్రపంచ రక్తపొటు దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వైద్యధికారి డాక్టర్ రవి తెలిపారు. అధిక రక్తపోటును సకాలంలో గుర్తించి చికిత్స అందించకుంటే చివరకు గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్ పై అవగాహన కల్పించటం ద్వారా పరిస్ధితి తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 17 ను ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు.