దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రవి శుక్రవారం పేర్కొన్నారు. డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్, బస్టాండ్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఆర్ధోవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.