
UGC-NET నోటిఫికేషన్ విడుదల
UGC-NET జూన్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. మే 7వ తేదీ రాత్రి 11.59 వరకు అభ్యర్థులు ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జూన్ 21 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 85 సబ్జెక్టుల్లో PhD ప్రవేశాలు, JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం ఏటా రెండు సార్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC-NET పరీక్షను నిర్వహిస్తుంది.