
మిస్టరీగానే వీరయ్య చౌదరి హత్య కేసు
AP: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 50 బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 55 మంది అనుమానితులను విచారించారు. అయితే తెలిసిన వారే కక్షతో నెల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులతో హత్య చేయించారని, ఇందులో 15 మంది ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్య జరిగి 22 రోజులు దాటినా.. పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయకుండా రహస్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.