డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామం నుండి తిరుమలాయ పాలెం పోయే రోడ్డు ఆదివారం వచ్చిన భారీ వరదకు రోడ్డు కొట్టుకుపోయింది. మట్టి, కంకర తేలి పంట పొలాల్లోకి కంకర కొట్టుకుపోయింది. దీనితో పంట పొలాలు జలమయమయ్యాయి. పంటలు నీటిలో మునిగి కొట్టుకుపోయాయని తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.