మహబూబాబాద్ జిల్లా
నర్సింహులపేట మండలం బుజ్జన్నపేట గ్రామ శివారులో శుక్రవారం
వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ కు గురై ఆరు గేదలు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం రాత్రి వీచిన గాలి దుమారానికి విద్యుత్ వైర్లు తెగి పడడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.