వరద ముంపు గ్రామాలలో కొనసాగుతున్న వైద్య శిబిరాలు

54చూసినవారు
వరద ముంపు గ్రామాలలో కొనసాగుతున్న వైద్య శిబిరాలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మండలంలో వరద ముంపు గ్రామలైన సీతారాం తండ, బాలిం ధర్మారం, ఉల్లేపల్లిలలో వైద్యశిబిరాలు ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరాల్లో మొత్తం 90 మందికి పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఈ సీజన్ లో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్త పడాలని, జ్వరాలు వస్తే స్థానిక వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు.