సీరోల్ మండలం తాళ్లసంకీసలో శుక్రవారం సావిత్రిబాయి పూలే 139వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేశారు. ఏఎన్ఎమ్స్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, మహిళా కానిస్టేబుళ్లు మొదలైన వారిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.