సీరోల్: డాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని మృతి

83చూసినవారు
సీరోల్: డాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని మృతి
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం 9వ తరగతి విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యా యులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్