
109 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూత
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన 109 ఏళ్ల వృద్ధురాలు అల్లిమిల్లి చంటమ్మ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆమెకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉండగా... మొత్తం 90 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆమె భర్త పాండవులు కాగా, ఆయన 20 ఏళ్ల క్రితం మరణించారు. విశేషంగా, వారి నలుగురు కుమారులకు పాండవుల పేర్లు పెట్టడం గమనార్హం. చంటమ్మ చనిపోయే ముందు వరకు ఆరోగ్యంగా ఉండటం విశేషం.