డోర్నకల్ నియోజకవర్గంలోని సీరోల్ మండలం కాంపల్లి గ్రామంలో శుక్రవారం ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పు చప్పులు, డీజే పాటలతో శివశక్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ఆవరణలో, అలాగే గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.