ఇటీవల బైక్ ప్రమాదంలో జర్నలిస్టు అజ్మీర సక్రంకు తీవ్ర గాయాలపాలై హైదరాబాదులో కాలుకు ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది. విషయం తెలిసిన చిలుకోడు గ్రామానికి చెందిన రామనబోయిన రాజు బుధవారం తన మిత్రులతో కలిసి జర్నలిస్టు సక్రం స్వగ్రామమైన డోర్నకల్ మండలం దుబ్బ తండా గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోని తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.