బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని డోర్నకల్ మండలం వెన్నారం బొడ్రాయి సెంటర్లో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర బుర్రకథను ప్రదర్శించారు. ఈ యొక్క ప్రదర్శన గురువారం రాత్రి నుంచి ప్రారంభమైందని గ్రామ ప్రజలు తెలిపారు. సోమవారం వరకు ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుర్ర కథ బృంద, తదితరులు పాల్గొన్నారు.