ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధం అయిన సంఘటన జనగాం జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద తండా గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుగులోతు భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలి బియ్యం, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్దమైనట్లు, ఇంట్లో నుండి భారీగా పొగలు రావడంతో స్థానికులు గమనించినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.