ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలోని గొల్లబజార్ కు చెందిన కొదిరిపాక సతీష్ (33) అనే ఆర్మీ జవాన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సతీష్ బుధవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెస్ట్ బెంగాల్ లోని ఆర్మీ క్యాంప్ కేంద్రంలో మృతి చెందినట్లు సమాచారం అందుకున్నట్లు వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.