

నన్ను అరెస్ట్ చేశారంటూ ఫేక్ ప్రచారం: కొడాలి నాని (వీడియో)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పేర్ని నానిని ఉంగటూరులో కొడాలి నాని శనివారం కలిసి పరామర్శించారు. పలు అంశాలపై చర్చించారు. భేటీ తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తన అరెస్టుపై ఆయన స్పందించారు. కొన్ని ఫేక్ ఛానళ్లు తనను అరెస్టు చేశారంటూ ప్రచారం చేశాయన్నారు. వంశీని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. అలాగే రాజకీయాలపై చర్చించుకున్నామని తెలిపారు.