జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన గ్రామంలో మలబరి తోటను సాగు చేస్తున్నాడు. మంగళవారం పనివారు వచ్చి ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో ఇంటికి వెళ్లి చూడగా కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. శ్రీనివాస్ భార్యకు తెలుపగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.