
సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాం: లోకేశ్
AP: బద్వేల్ నియోజకవర్గంలో అన్నదాన సత్రాన్ని కూల్చడం బాధాకరమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై ఆయన ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు. అటవీ నిబంధనల పేరిట కూల్చడం సరికాదన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి.. కూల్చకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సొంత నిధులతో అదే స్థలంలో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని మంత్రి చెప్పారు.