చేర్యాల: మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

63చూసినవారు
చేర్యాల: మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
చేర్యాల పట్టణ కేంద్రంలో రెండో వార్డ్ లో ఇటీవల అనారోగ్యంతో భూమిగారి నరసయ్య మృతి చెందారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ చెవిటి లింగం శనివారం 50 కిలోల బియ్యం వారి కుటుంబానికి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా లింగం మాట్లాడుతూ నరసయ్య కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నాగిని మల్లేశం, బసగల నవీన్, భూమిగారి మధుకర్, పోతుగంటి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్