చేర్యాల: అనారోగ్యంతో మేస్త్రి మృతి

78చూసినవారు
చేర్యాల: అనారోగ్యంతో మేస్త్రి మృతి
చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన గదరాజు లాజర్ (రామయ్య)64 అనే తాపీమేస్త్రి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు లాజర్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్