జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల సన్నాహక సమావేశం కొరకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని, ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా నినాదాలతో సమావేశ స్థలానికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి అత్తా కోడలు ఇద్దరు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నాయకులందరూ పాల్గొన్నారు.