కొమురవెల్లిలో సిపిఎం పార్టీ శిక్షణ తరగతులు

74చూసినవారు
కొమురవెల్లిలో సిపిఎం పార్టీ శిక్షణ తరగతులు
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) (సిపిఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రారంభించారు. ఆదివారం స్థానిక ఒక ప్రైవేట్ వేడుకల మందిరంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ ప్రారంభించారు. ఈ తరగతులకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు, జిల్లా, మండలం, పట్టణ కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు హాజరయ్యారు.