రసులాబాద్ లో విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి

68చూసినవారు
రసులాబాద్ లో విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి
జిల్లా కేంద్రమైన జనగామ నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండలం రసులాబాద్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల యాదయ్య పాడి ఆవు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దాదాపు 90 వేల రూపాయల విలువ చేసే ఆవు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొందని, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ పచ్ఛిమడ్ల స్వామి గౌడ్ కోరారు.

సంబంధిత పోస్ట్