జనగామ జిల్లా పాలకూర్తి నియోజకవర్గం దేవరపల్లి మండల పరిధిలోని ధర్మాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని గ్రామ కార్యదర్శి జై భీమ్ అమర్ రహే, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తూ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.