మద్దూరు మండలానికి చెందిన కొంగరి నారాయణకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ని మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.