కొమ్మూరిని కల్సిన ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు

78చూసినవారు
కొమ్మూరిని కల్సిన ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు
జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్ధినిల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని
కళాశాల అధ్యాపక బృందం మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కల్సి కోరారు. శనివారం చేర్యాల లోని ఆయన స్వగృహంలో ప్రతాప్ రెడ్డి ని కల్సిన అధ్యాపకులు ఈ మేరకు కళాశాలకు అవసరమైన సౌకర్యాల కోసం వినతిపత్రాన్ని అందించి శాలువతో ఘనంగా సన్మానించారు

సంబంధిత పోస్ట్