ఏడునూతల గ్రామపంచాయతీ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల

61చూసినవారు
ఏడునూతల గ్రామపంచాయతీ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని ఏడునూతల గ్రామపంచాయతీ వద్ద బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాణ కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవంలో భాగంగా సోమవారం గ్రామంలోని అన్ని వర్గాల ముఖ్య నాయకులు భీమ్రావు చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.