

జూన్ 28న పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ (వీడియో)
TG: హైదరాబాద్‌లో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) ప్లైఓవర్‌గా నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఈ ఫ్లైఓవర్‌తో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది.