జనగామ జిల్లా కొడకండ్ల మండలం జీబీ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి సెంటర్ టీచర్ J. స్వాతి శనివారం పోషణ పక్షోత్సవాల సందర్భంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఎస్ హెచ్ఎం రామనాథ్ కేంద్ర పరిధిలోని పిల్లలకు అన్నప్రాసన చేయించారు. ఈ కార్యక్రమంలో టీచర్ రమేష్, సూపర్ వైజర్, కార్యదర్శి సంతోష్, ఏఎన్ఎంలు సైదమ్మ, రజిత, ఆశా కార్యకర్త వినోద్, సోమాలి పాల్గొన్నారు.