
కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రెవోస్ట్ ఎన్నిక
కాథలిక్ చర్చి కార్డినల్స్ కొత్త పోప్‌ను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రీవోస్ట్‌ను 267వ పోప్‌గా ఎన్నుకున్నారు. ఆయన పోప్ లియో XIV అనే పేరుతో బాధ్యతలు స్వీకరించారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చింది. దీంతో కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్ పేరును ఫ్రాన్స్‌కు చెందిన కార్డినల్ డొమినిక్ మాంబెర్టి ప్రకటించారు.