జనగామ: హైదరాబాద్ లో జనగామ వాసి దారుణ హత్య

69చూసినవారు
హైదరాబాద్ లో శుక్రవారం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యారు. మేడిపల్లి పరిధిలోని అనురాగ్ బాయ్స్ హాస్టల్లో జనగామకు చెందిన మహేందర్ రెడ్డి(38)ని మిర్యాలగూడకు చెందిన కిరణ్ రెడ్డి కత్తితో పొడిచి హత్య చేశాడు. వారిద్దరూ ఇదే హాస్టల్లో ఉంటూ క్యాబ్ నడిపేవారని స్థానికులు తెలిపారు. కాగా హాస్టల్లో ఉండే మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్