జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి మండలం నుండి 50 వేలకు తక్కువ కాకుండా రావాలని కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో మండల, గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.