జనగామ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ వద్ద శనివారం సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని, నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టకపోవడంతో పగుళ్లు పడుతుందని వెంటనే మార్కెట్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని కోరారు.