జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శుక్రవారం జరిగిన దీక్షా దివస్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి టార్గెట్ గా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో కడియం శ్రీహరిలో నీతి కూడా అంతే, నీతి నిజాయితీ అని మాట్లాడుతున్న కడియం శ్రీహరి సిగ్గు శరం ఉంటే కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ గెలిచి చూపించు అన్నారు.