జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన వివాహ మహోత్సవానికి మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రస్తుత నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధూవరులు గోపేష్, సాహితీలను ఆశీర్వదించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో మండల, గ్రామాల మరియు యూత్ నాయకులు కూడా పాల్గొన్నారు.