
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.