జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని 50 మంది లైన్స్ క్లబ్ సభ్యులు ఈ మధ్యనే మరణించిన పేద రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. గోధుమల మహేష్ కుటుంబానికి పదిహేను వేల రూపాయలు, మహమ్మద్ గౌస్ పాషా కుటుంబానికి 25 వేల రూపాయలు అధ్యక్షుడు దామెర రవీందర్, ఉపాధ్యక్షుడు సుంకర నేను కోటి, సెక్రటరీ నీతి కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వారి ఇంట్లోకి వెళ్లి అందించారు.