జనగామ: దీక్షా దివస్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
జనగామ జిల్లాలో దీక్షా దివస్ ను పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం నెహ్రూ పార్క్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమం వద్ద తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.