జనగామ నియోజకవర్గం శామీర్ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్వాల నర్సింగ రావు సతీమణి సర్వాల లలిత స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం అక్కడికి చేరుకొని లలిత చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం నర్సింగ రావుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.