జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూర్ గ్రామంలో ఉన్న బలహీన వర్గాల విద్యార్థుల వసతి గృహాన్ని దేవరుప్పుల మండల తహసీల్దార్ ఎం. మహిపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. శనివారం ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతను, విద్యార్ధుల ఆరోగ్యాన్ని, వంట గదిని, సిబ్బంది పనితీరు, స్టోర్ రూమ్లను, ఆట స్థలాన్ని, రిజిస్టర్లను పరిశీలించారు. వారి వెంట ఆర్ఐలు రాజు, ఆంధ్రయ్య తదితరులున్నారు.