జనగామ ఎమ్మెల్యే ఇటీవల కేసిఆర్ ఫాం హౌస్ లో కిందపడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆదివారం ఆసుపత్రి నుంచి ఓ వీడియో రీలీజ్ చేశారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానన్నారు. డాక్టర్లు రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారని, త్వరలో పూర్తి స్థాయిలో కోలుకొని ప్రజా సేవలో పాల్గొంటానని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెంద్దోదని సూచించారు.