జల్సాలకు అలవాటు పడి జనగామ జిల్లాలో ఏటీఎంలో వద్ద ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు దొంగలించిన నిందితుడిని అరెస్ట్ చేసి
జనగామ పోలీసు స్టేషన్ లో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుడు వద్ద నుండి పదివేల రూపాయల నగదు, 9 ఎస్బిఐ ఏటీఎం కార్డులు, ఒక సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుంటూరు జిల్లా ఇనుమెల్ల గ్రామానికి చెందిన ముల్లంపూడి వెంకట కోటేశ్వరరావు గా ఎసిపి చైతన్ నితిన్ వెల్లడించారు.