జనగామ ఎమ్మార్వో కార్యాలయానికి మండలంలోని వందలాది మంది తమ పనులపై నిత్యం వస్తుంటారు.
శుక్రవారం వచ్చిన చిన్న వర్షానికే నీరు నిలిచి కార్యాలయ ఆవరణం చెరువును తలపిస్తోందని స్థానికులు అంటున్నారు.
పనులపై వస్తే నీరు, బురదతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ సైతం నీటిలోనే చేయాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి ఆవరణలో మట్టి పోయించాలని కోరుతున్నారు.