జనగామ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్టేషన్ ఘన్ పుర మండలం రాఘవాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు.