జనగామ జిల్లాలో పండగ పూట విషాదం జరిగింది. రఘునాథపల్లి మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన సంపత్ నారాయణ రెడ్డి లింగాల ఘనపురం మండలం నవాబుపేటకు చెందిన చారి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. గోవర్ధనగిరి క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.