జనగామ: ఎండిన వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం ధర్నా

68చూసినవారు
జనగామ: ఎండిన వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం ధర్నా
జనగామ జిల్లాలో ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, జిల్లాలో పంటల ఎన్యురేషన్ చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరువ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్