
సెల్లో చొక్కాతో ఉరేసుకుని గంజాయి కేసు నిందితుడు ఆత్మహత్య
కడపలో గంజాయి కేసులో నిందితుడైన షేక్ సోను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కడప నకాష్ వీధికి చెందిన షేక్ సోనును నిన్న రాత్రి గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో అతన్ని హాజరు పరచాల్సి ఉంది. అయితే ఇంతలోనే టూటౌన్ పోలీస్ స్టేషన్ సెల్లో తన చొక్కాతో ఉరేసుకుని సోను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఎందుకు ఇలా చేశాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.