
ఫ్లైట్ క్రాష్.. దర్యాప్తుకు అమెరికా బృందం
అహ్మదాబాద్‌లో జరిగిన ఫ్లైట్ క్రాష్‌పై సమగ్ర దర్యాప్తుకు అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) ప్రత్యేక బృందాన్ని భారత్‌కు పంపనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆధీనంలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విచారణ ప్రారంభించగా.. సమాచారం సేకరణలో NTSBకు AAIB బృందం పూర్తి సహకారం అందించనుంది.