బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన యువకులు అంబేద్కర్ జయంతి సందర్బంగా జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రక్తదానం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ హాస్పిటల్ లో ఎంతో మంది రక్తం లేక చనిపోతున్నారు. మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ప్రమోద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.