జనగామ జిల్లా కొడకండ్ల సమగ్ర శిశు అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టు అధికారి ఆదేశానుసారం కొడకండ్ల, మొండ్రాయి సెక్టార్ల సూపర్ వైజర్ పి. సరళ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు పిల్లల ఏకరూప దుస్తులను మంగళవారం ప్రాజెక్టు ఆఫీస్ వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఎండి మైముదా, పద్మ, ప్రాజెక్టు సిబ్బంది, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.